డాక్టర్‌ సుశీల

ABN , First Publish Date - 2023-11-22T00:19:27+05:30 IST

ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీలకు చెన్నైలోని ‘డాక్టర్‌ జె. జయలలిత మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ’ లిటరేచర్‌ విభాగంలో...

డాక్టర్‌ సుశీల

ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీలకు చెన్నైలోని ‘డాక్టర్‌ జె. జయలలిత మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ’ లిటరేచర్‌ విభాగంలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మంగళవారం జరిగిన ఆ యూనివర్శిటీ రెండో స్నాతకోత్సవంలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ఈ డాక్టరేట్‌ను ఆమెకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వామినాథన్‌, కర్నాటక సంగీత కళాకారుడు టీఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి, చెన్నై)

Updated Date - 2023-11-22T00:19:29+05:30 IST