‘జైలర్‌’నే ఖైదీగా మార్చేస్తుందా?

ABN , First Publish Date - 2023-01-21T05:46:52+05:30 IST

ఈ యేడాదిపై తమన్నా చాలా ఆశలు పెట్టుకొంది. అటు తమిళంలో రజనీకాంత్‌, ఇటు తెలుగులో చింరజీవి చిత్రాల్లో నటిస్తోంది...

‘జైలర్‌’నే ఖైదీగా మార్చేస్తుందా?

ఈ యేడాదిపై తమన్నా చాలా ఆశలు పెట్టుకొంది. అటు తమిళంలో రజనీకాంత్‌, ఇటు తెలుగులో చింరజీవి చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. ఈ రెండూ ఈ యేడాదే విడుదల అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్‌ అయినా తమన్నా రేంజ్‌ మరింత పెరగడం ఖాయం. లేటెస్టుగా రజనీకాంత్‌ ‘జైలర్‌’లోని తమన్నా లుక్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నాది గ్లామర్‌ పాత్రే అనే సంగతి ఫస్ట్‌ లుక్‌తోనే అర్థమవుతోంది. జైలర్‌నే ఖైదీగా మార్చేసేలా.. తమన్నా పాత్ర ఉండబోతోందంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్ల వరద పారిస్తున్నారు. నెల్సన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కళానిధిమారన్‌ నిర్మాత. ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అనిరుథ్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Updated Date - 2023-01-21T05:46:52+05:30 IST