పేపర్‌ బోయ్‌ ప్రేమలో డాక్టర్‌

ABN , First Publish Date - 2023-08-26T05:10:48+05:30 IST

Paper Boy is a doctor in love

పేపర్‌ బోయ్‌ ప్రేమలో డాక్టర్‌

అముద శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమకథ’. శ్రవణ్‌ కుమార్‌ నిర్మాత. కారుణ్య చౌదరి, రమ్య, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించడం పెద్ద ఛాలెంజ్‌. అందరి సహకారంతో సినిమా పూర్తయింది. ఓ పేపర్‌ బోయ్‌కీ, డాక్టర్‌కీ మధ్య జరిగిన ప్రేమకథ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొదించాం’’ అన్నారు. ‘‘కథ వినగానే నచ్చింది. దర్శకుడికి స్వేచ్ఛ ఇచ్చాను. అనుకొన్నది అనుకొన్నట్టు సినిమా తీశాడ’’ని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-08-26T05:10:48+05:30 IST