నేనెవరో తెలుసు కదా?

ABN , First Publish Date - 2023-10-17T03:25:31+05:30 IST

సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాత...

నేనెవరో తెలుసు కదా?

సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘తెలుసు కదా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ‘‘సరికొత్త కథాంశం ఇది. ప్రేమ, స్నేహం, కుటుంబం, త్యాగం, స్వార్థం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాల్నీ మేళవించాం. సిద్దు లుక్‌ ఫ్రెష్‌గా ఉంటుంది. సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ పడడం లేదు’’ అని నిర్మాత తెలిపారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Updated Date - 2023-10-17T03:25:31+05:30 IST