డీజె పిల్లా.. ఎదలో ఇల్లా
ABN , First Publish Date - 2023-09-06T03:22:19+05:30 IST
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా నుంచి ‘డీజే పిల్లా’ పాటను సోమవారం విడుదల చేశారు. కిట్టు విస్పాప్రగడ రాసిన ఈ పాటను వైషాగ్ పాడారు...

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా నుంచి ‘డీజే పిల్లా’ పాటను సోమవారం విడుదల చేశారు. కిట్టు విస్పాప్రగడ రాసిన ఈ పాటను వైషాగ్ పాడారు. శరవణ వాసుదేవన్ బాణీలు సమకూర్చారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా ‘శశివదనే’ రూపుదిద్దుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మంచి ప్రేమకథ వచ్చి చాలా రోజులు అయిందని అందరూ అనుకుంటున్నారు. వారి కోరిక ‘శశివదనే’తో తీరుతుందని అనుకుంటున్నాం. హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్‌తో చిత్రం రూపుదిద్దుకుంది. త్వరలో విడదుల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.