దీపావళి టపాసులా...
ABN , First Publish Date - 2023-09-12T01:00:28+05:30 IST
లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జిగర్ తాండా డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మాతలు...

లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జిగర్ తాండా డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మాతలు. సోమవారం మహేశ్‌బాబు చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. తమిళ టీజర్‌ని ధనుష్, మలయాళ వెర్షన్‌ని దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి విడుదల చేశారు. ‘‘గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగిన ‘జిగర్ తాండా’ సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ ఇది. తమిళనాడు, కేరళలోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. దీపావళికి విడుదల చేస్తామ’’న్నారు దర్శకుడు. సంగీతం: సంతోష్ నారాయణన్.