దివ్యభారతిగా తమన్నా?

ABN , First Publish Date - 2023-09-09T04:23:10+05:30 IST

తొంభైల దశకంలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కథానాయిక దివ్యభారతి. ‘బొబ్బిలిరాజా’ చిత్రంతో పరిచయమైన

దివ్యభారతిగా తమన్నా?

తొంభైల దశకంలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కథానాయిక దివ్యభారతి. ‘బొబ్బిలిరాజా’ చిత్రంతో పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయింది. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ అందాల నటి 19 ఏళ్ల వయసులోనే అందరికీ దూరమయ్యారు. అమెది హత్యా, ఆత్మహత్య అనేది ఈనాటికీ వీడని మిస్టరీ. చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల జీవిత కథలు సినిమాలుగా వస్తున్న తరుణం ఇది. అలాగే మలయాళ దర్శకుడు అరుణ్‌ గోపి దివ్యభారతి బయోపిక్‌ తీసే సన్నాహాల్లో ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఆమె అంగీకరిస్తే దివ్యభారతి బయోపిక్‌ ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2023-09-09T04:23:14+05:30 IST