Katha Venuka Katha: ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు వదిలిన టీజర్

ABN , First Publish Date - 2023-02-17T21:52:57+05:30 IST

ఓ యంగ్ డైరెక్ట‌ర్ (విశ్వంత్) మ‌రో పాత్ర‌కు ఓ క్రైమ్ క‌థ‌ను చెప్ప‌టంతో టీజ‌ర్ మొదలైంది. సిటీలో చాలా వ‌ర‌కు మిస్సింగ్ కేసులుగా న‌మోదు అవుతున్న అమ్మాయిల‌ను

Katha Venuka Katha: ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు వదిలిన టీజర్
Katha Venuka Katha Movie Still

దండమూడి బాక్సాఫీస్ (Dandamudi Box Office) బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’ (Katha Venuka Katha). విశ్వంత్ దుడ్డుంపూడి (Viswanth Duddumpudi), శ్రీజిత గౌష్‌ (Srijitha Ghoush), శుభ శ్రీ (Subha Sri) ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య (Krishna Chaitanya) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను శుక్ర‌వారం.. ‘క్రాక్‌, వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రిలీజ్ చేశారు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని, సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కి ఆయన అభినంద‌న‌లు తెలిపారు.

70 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ‘కథ వెనుక కథ’ టీజ‌ర్‌ (Katha Venuka Katha Teaser)ను గ‌మ‌నిస్తే.. ఓ యంగ్ డైరెక్ట‌ర్ (విశ్వంత్) మ‌రో పాత్ర‌కు ఓ క్రైమ్ క‌థ‌ను చెప్ప‌టంతో టీజ‌ర్ మొదలైంది. సిటీలో చాలా వ‌ర‌కు మిస్సింగ్ కేసులుగా న‌మోదు అవుతున్న అమ్మాయిల‌ను ఎవ‌రో హ‌త్య చేస్తుంటారు. ఇంత భ‌యంక‌ర‌మైన హ‌త్య‌ల‌ను చేస్తున్న హంత‌కుడెవ‌రో పోలీసుల‌కు అంతు చిక్క‌దు. దీంతో వారు కేసుని స‌త్య (సునీల్‌) (Sunil) అనే సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కి అప్ప‌గిస్తారు. సిటీలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు ఓ వ్య‌క్తి కార‌ణం కాద‌ని, ఓ గ్యాంగ్ క‌లిసి ఈ హ‌త్య‌ల‌ను చేస్తుంద‌ని స‌త్య‌ తెలుసుకుంటాడు. మ‌రి ఈ విష‌యాన్ని స‌త్య ఎలా క‌నుక్కుకున్నాడు? అత‌ను టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిస్ అయిన ఓ పాయింట్ ఏంటి? అనేలా టీజ‌ర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు.

టీజ‌ర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ ప్ర‌కారం విశ్వంత్ పాత్ర ప‌జిలింగ్‌గా అంద‌రూ అనుమాన ప‌డేలా క‌నిపిస్తుంది. మ‌రో వైపు ఇదే క్యారెక్ట‌ర్ 2019లో జ‌రిగిన దిశ రేప్, మ‌ర్డ‌ర్ కేసు గురించి చెప్ప‌టం.. అప్పుడు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన ఎమోష‌న‌ల్ రియాక్ష‌న్స్‌, దానికి పోలీసులు చూపించిన యాక్ష‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఉంటుంది. అస‌లు వ‌రుస హ‌త్య‌ల వెనుకున్న సీరియ‌ల్ లింకును సునీల్ ఏం మిస్ చేసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పోలీసులు చేసే ఇంట‌రాగేష‌న్‌, ప్రొసీజ‌ర్స్‌, పోర్ష‌న్స్‌, బ్యాక్‌డ్రాప్ అనేది చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తుంది. కాగా.. త్వరలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేస్తామని, ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Katha Venuka Katha Teaser talk)

Updated Date - 2023-02-17T21:52:59+05:30 IST