NBK 109: ఎలా ఉండబోతోదంటే.. దర్శకుడు క్లారిటీ

ABN , Publish Date - Dec 25 , 2023 | 05:29 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో NBK109 సిద్థమవుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంపై బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘NBK 109’ ఎలా ఉండనుంది? అని అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

NBK 109: ఎలా ఉండబోతోదంటే.. దర్శకుడు క్లారిటీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ (Ks ravindra) కాంబినేషన్‌లో NBK109 సిద్థమవుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంపై బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘NBK 109’ ఎలా ఉండనుంది? అని అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. "అభిమానులు అంతా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. వాళ్లకు ఒకటే చెబుతున్నా. ఒక్కటే మాట ఇస్తున్నా. బాలయ్యబాబుతో సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది. ఇటీవల ఊటీలో ఒక భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లనున్నాం. త్వరలో అప్‌డేట్‌ ఇస్తాం’’అని అన్నారు. 

'భగవంత్ కేసరి’ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ నవంబర్‌ నుంచి మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం గతంలో ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌’ అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ సినీ ప్రియులను ఆకర్షించింది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రను దుల్కర్‌ సల్మాన్ కనిపిస్తారని వార్తలు హల్‌చల్‌ చేశాయి. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. 

Updated Date - Dec 25 , 2023 | 05:50 PM