గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చిందంతే!

ABN , First Publish Date - 2023-12-12T03:06:44+05:30 IST

సీనియర్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు, నటుడు వైభవ్‌ నటించిన తాజా సినిమా ‘ఆలంబన’ ఈ నెల 15న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పార్వతీ నాయర్‌ హీరోయిన్‌...

గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చిందంతే!

సీనియర్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు, నటుడు వైభవ్‌ నటించిన తాజా సినిమా ‘ఆలంబన’ ఈ నెల 15న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పార్వతీ నాయర్‌ హీరోయిన్‌. పారి కె విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో మహేశ్వరరెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వైభవ్‌ మాట్లాడుతూ ‘నాకు ఇది చాలా పెద్ద సినిమా. ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సినిమా మొదలైన పదిహేను నిముషాల తర్వాత జీనీ పాత్ర ఎంటర్‌ అయి చివరి వరకూ అలరిస్తుంది’ అన్నారు. తెలుగులో కావాలని గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చిందంతే. కొన్ని మంచి పాత్రలు వచ్చాయి కానీ అవి మిస్‌ అయ్యాయి’ అన్నారు. ‘నాకు ఇదే తొలి సినిమా. మా నిర్మాత రాజేశ్‌గారికి కథ చెప్పా. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనీ, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని ప్రోత్సహించారు. మురళీశర్మగారు కథ నచ్చి తమిళ చిత్రమైనా నటించారు. జీనీ ఉందని ఇది పిల్లల సినిమా అనుకోవద్దు. పెద్దలు కూడా చూసే చిత్రం. యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ తీసుకుని చేశాం’ అన్నారు దర్శకుడు విజయ్‌. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘శివ కార్తికేయన్‌ నటించిన ‘వరుణ్‌ డాక్టర్‌’ చిత్రం తర్వాత తెలుగులో మేం విడుదల చేస్తున్న సినిమా ఇది. ప్రేక్షకులందరినీ నవ్విస్తుంది. వైభవ్‌ కామెడీతో పాటు ఫైట్స్‌ కూడా బాగా చేశాడు’ అన్నారు.

Updated Date - 2023-12-12T03:06:46+05:30 IST