తెలుసుకదా మొదలైంది
ABN , First Publish Date - 2023-10-19T00:15:23+05:30 IST
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసుకదా’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు నాని క్లాప్ ఇచ్చారు...

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసుకదా’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు నాని క్లాప్ ఇచ్చారు. స్ర్కిప్ట్‌ను నితిన్, ఆది పినిశెట్టి చిత్రబృందానికి అందజేశారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలిషాట్‌కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్ జె