జీతంగా రాళ్లూ రప్పలూ ఇచ్చారా?

ABN , First Publish Date - 2023-08-06T03:02:10+05:30 IST

కథానాయిక సమంత మయో సైటిస్‌ సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. సమంత చికిత్స కోసం ఓ కథానాయకుడు రూ.25 కోట్లు సాయం అందించాడంటూ...

జీతంగా రాళ్లూ రప్పలూ ఇచ్చారా?

కథానాయిక సమంత మయో సైటిస్‌ సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. సమంత చికిత్స కోసం ఓ కథానాయకుడు రూ.25 కోట్లు సాయం అందించాడంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సమంత స్పందించింది. మయో సైటిస్‌ చికిత్సకు పాతిక కోట్లు ఎందుకని, ఎవరో తప్పుడు సమాచారం అందించారని కౌంటర్‌ వేసింది. ‘‘నా కెరీర్‌లో ఇప్పటి వరకూ పని చేసినందుకు నాకు జీతంగా రాళ్లూ రప్పలూ ఇవ్వలేదని నేను భావిస్తున్నా. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయో సైటిస్‌ సమస్యతో చాలామంది బాధ పడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించి సమాచారం అందించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అంటూ సమాధానమిచ్చింది.

Updated Date - 2023-08-06T03:02:10+05:30 IST