రామన్న యూత్ గెలిచిందా?
ABN , First Publish Date - 2023-09-08T02:05:11+05:30 IST
అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది...

అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా ‘రామన్న యూత్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉంది. తన జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా అభయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రామన్న యూత్ గెలవాలి’ అని ఆకాంక్షించారు. అభయ్ నవీన్ మాట్లాడుతూ ‘ఓ గ్రామంలో రాజకీయ నాయకుడిగా ఎదగాలని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు, దానివల్ల అతని జీవితంలో తలెత్తిన సంఘర్షణను ఆకట్టుకునేలా చూపించబోతున్నాం. సినిమా మీకు నచ్చుతుంద’న్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేశ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్. సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్