ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది
ABN , First Publish Date - 2023-10-19T00:09:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ గురించి అడిగినప్పుడు ‘నేను ప్రత్యేకంగా ఒక నాయకుడి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ గురించి అడిగినప్పుడు ‘నేను ప్రత్యేకంగా ఒక నాయకుడి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది. వ్యక్తిగత దూషణలతో లేదా అణచివేత కోసం ఎవరినైనా బంధిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుకి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో చాలా మంది నాయకులు జైల్లో ఉన్నారు. తర్వాత ఏమైంది? ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయింది. నాయకులు సరిగ్గా పనిచేస్తే దానికి తప్పకుండా విలువ ఉంటుంది. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాటం చేస్తున్నందుకు గర్వపడుతున్నా’ అన్నారు నరేశ్. చంద్రబాబు అరె్‌స్టపై పరిశ్రమ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తే ‘రాజకీయ పరమైన చర్చల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. మేం కేవలం వినోదం అందించే వాళ్లమే. దీనికి సమాధానం ప్రజలే చెప్పాలి. ఇప్పుడు సమాజం మొత్తం మౌనంగా ఉందంటే తిరుగుబాటు కోసమే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరేశ్.