డెవిల్‌ సెన్సార్‌ పూర్తి

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:17 AM

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన తాజా చిత్రం ‘డెవిల్‌’ సెన్సార్‌ పూర్తయింది. ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాత అభిషేక్‌ నామా చెప్పారు. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా...

డెవిల్‌ సెన్సార్‌ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన తాజా చిత్రం ‘డెవిల్‌’ సెన్సార్‌ పూర్తయింది. ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాత అభిషేక్‌ నామా చెప్పారు. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పీరియాడిక్‌ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. సెన్సార్‌ పూర్తయింది. రన్నింగ్‌ టైమ్‌ రెండు గంటల ఇరవై ఆరు నిముషాలు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ గాంధీ నడికుడికర్‌ ఆధ్యర్యంలో సినిమా కోసం ఓ ప్రత్యేక లోకాన్ని క్రియేట్‌ చేశాం. దీనికి సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫీ తోడు కావడంతో విజువల్స్‌ నెక్ట్స్‌ రేంజ్‌లో మెప్పిస్తాయి.’ అని చెప్పారు.

Updated Date - Dec 22 , 2023 | 05:17 AM