దేవరాజ్‌ తనయుడి వైరం

ABN , First Publish Date - 2023-03-19T00:41:54+05:30 IST

విలన్‌ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దేవరాజ్‌ తనయుడు ప్రణం దేవరాజ్‌ హీరోగా పరిచయమవుతున్న ద్విభాషా చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకత్వంలో జె. మల్లికార్జున నిర్మిస్తున్నారు...

దేవరాజ్‌ తనయుడి వైరం

విలన్‌ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దేవరాజ్‌ తనయుడు ప్రణం దేవరాజ్‌ హీరోగా పరిచయమవుతున్న ద్విభాషా చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకత్వంలో జె. మల్లికార్జున నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వైరం’ టీజర్‌ను బెనర్జీ, కాశీ విశ్వనాథ్‌ విడుదల చేశారు. బ్యానర్‌ లోగోను దేవరాజ్‌, చంద్రదేవరాజ్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దేవరాజ్‌ మాట్లాడుతూ ‘నన్ను ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు నా కుమారుణ్ణి ఆదరించాలి’ అని కోరారు. కన్నడలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రణం అద్భుతంగా నటించాడు అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌. సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్‌

Updated Date - 2023-03-19T00:41:54+05:30 IST