రుచికరమైన సినిమా...

ABN , First Publish Date - 2023-02-10T00:20:56+05:30 IST

‘చిన్నారి పెళ్లి కూతురు’గా అలరించింది అవికాగోర్‌. బుల్లితెరపై తనో స్టార్‌. ఆ తరవాత వెండి తెరపైనా విజయాలు అందుకొంది...

రుచికరమైన సినిమా...

‘చిన్నారి పెళ్లి కూతురు’గా అలరించింది అవికాగోర్‌. బుల్లితెరపై తనో స్టార్‌. ఆ తరవాత వెండి తెరపైనా విజయాలు అందుకొంది. పద్ధతైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తను నటిస్తూ నిర్మించిన ‘పాప్‌కార్న్‌’ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ ‘‘నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. ‘పాప్‌కార్న్‌’ కథ నచ్చి సహ నిర్మాతగా వ్యవహరించా. నిజంగా ఇది చక్కటి అనుభవం. 90 శాతం లిఫ్ట్‌లో నడిచే సినిమా ఇది. లిఫ్ట్‌లోనే ఆట పాటలు, డాన్స్‌, అల్లరి.. అన్నీ ఉంటాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే ‘పాప్‌కార్న్‌’లా రుచికరంగా ఉంటుంది. ఇలాంటి కథలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. రోజుకో కొత్త విషయం నేర్చుకొన్నా. సాయిరోనక్‌ చాలా మంచి నటుడు. తన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. స్టార్‌ హీరోల పక్కన నటించే అవకాశాలు రావడం లేదని ఎప్పుడూ అనుకోలేదు. నేనేం అలాంటి సినిమాలకు వ్యతిరేకం కాదు. కానీ నన్ను నమ్మి కొన్ని కథలు నా దగ్గరకు వస్తున్నాయి. అలాంటి కథల్లో నటించడంలో నాకెక్కువ సంతృప్తి ఉంటుంది. ప్రస్తుతం ‘1920’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నా. తెలుగులోనూ రెండు కొత్త చిత్రాలు ఒప్పుకొన్నా. నిర్మాతగా కొన్ని ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి’’ అంది.

Updated Date - 2023-02-10T00:20:58+05:30 IST