బన్నీతో దీపిక...?

ABN , First Publish Date - 2023-10-31T06:00:33+05:30 IST

దీపిక పదుకొణె ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కల్కి’లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే...

బన్నీతో దీపిక...?

దీపిక పదుకొణె ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కల్కి’లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకొనే చిత్రంలోనూ దీపిక కథానాయికగా నటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో దీపిక భాగం పంచుకోబోతున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ తరవాత.. ఈ జోడీలో వస్తున్న సినిమా ఇది. ఇందులో కథానాయికగా దీపిక అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేశ్‌ బాబుతో ‘గుంటూరు కారం’ రూపొందిస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక బన్నీ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్తుంది.

Updated Date - 2023-10-31T06:00:33+05:30 IST