గురువులకు అంకితం
ABN , First Publish Date - 2023-09-05T02:12:45+05:30 IST
‘సినిమా బండి’ ఫేమ్ వికాశ్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...

‘సినిమా బండి’ ఫేమ్ వికాశ్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు’ అంటూ సాగే లిరికల్ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సుద్ధాల అశోక్‌తేజ్ రాయగా మనో ఆలపించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఈ సినిమా కథ కూడా ఉపాఽధ్యాయ వృత్తి, విద్యావ్యవస్థ లోపాల ఆధారంగా తెరకెక్కించాం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కార్తీక్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. సినిమాలో మంచి సందేశం ఉంద’ని చెప్పారు.