Theatre-Ott movies: చివరి నెల.. మొదటివారం.. సందడి ఈ చిత్రాలదే!

ABN , First Publish Date - 2023-11-27T11:59:51+05:30 IST

2023 చివరికి చేరుకుంది. డిసెంబర్‌ మొదటివారంలో పలు చిత్రాలో థియేటర్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Theatre-Ott  movies: చివరి నెల.. మొదటివారం.. సందడి ఈ చిత్రాలదే!

2023 చివరికి చేరుకుంది. డిసెంబర్‌ మొదటివారంలో (December First week movies) పలు చిత్రాలో థియేటర్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక మందన్నా కథానాయిక. బాబీ దేవోల్‌ విలనగా కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ ఒకటో తేదీన హిందీ, తెలుగు, భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’తో పాపులర్‌ అయిన సందీప్‌ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌ విడుదలయ్యాక ఆ జోరు మరింత పెరిగింది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

Animal.jpg

సుడిగాలి సుధీర్‌, డాలీషా జంటగా అరుణ్‌ విక్కిరాలా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’(Calling sahasra). విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడిచ వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ‘కాలింగ్‌ సహస్ర’ రూపొందింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది.

Sahasra.jpg

మాస్‌ మసాలా... (Upendra gaadi adda)

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన ఎస్‌.కె తెరకెక్కించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. ‘కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన మాస్‌ చిత్రమిది. చక్కని సందేశంతో ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. డిసెంబర్‌ 1న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌...

కార్తిక్‌రాజు కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అథర్వ’. సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. ‘ఇదొక భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. వచ్చే నెల ఒకటో తేదిన చిత్రం విడుదల కానుంది.


ఓటీటీలో అలరించే చిత్రాలివే:

Dhootha.jpg

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

డిసెంబరు 1 : దూత (తెలుగు సిరీస్‌)

(Dhootha web series)

డిసెంబరు 1 : క్యాండీ కేన్‌ లేన్‌ (ఇంగ్లిష్‌)


నెట్‌ఫ్లిక్స్‌

నవంబరు 30న స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు 

బుజ్జిగాడు

ఖుషి (తెలుగు)

ఈ రోజుల్లో (తెలుగు)

బంగారు బుల్లోడు (తెలుగు)

ఐతే (తెలుగు)

ఓబ్లిటిరేటెట్‌ (ఇంగ్లిష్‌) 

ఫ్యామిలీ స్విచ్‌ (ఇంగ్లిష్‌) 

ది బ్యాడ్‌ గాయ్స్‌ : ఎ వెరీ బ్యాడ్‌ హాలీడే (యామినేషన్‌ మూవీ)

మిషన్‌ రాణిగంజ్‌ (హిందీ) డిసెంబరు 1 (mission raniganj)


డిసెంబరు 1 :

స్వీట్‌ హోం: సీజన్‌-1 (కొరియన్‌)

ది ఈక్వలైజర్‌ (ఇంగ్లిష్‌)

క్యాటరింగ్‌ క్రిస్మస్‌ (ఇంగ్లిష్‌)


జియో సినిమా

800 (తమిళ్‌) డిసెంబరు 2

Chinna.jpg

డిస్నీ హాట్‌స్టార్‌

నవంబరు 28 (Chinna): ఇన్‌సైడ్‌ ఎన్‌ఎస్‌జీ  (డాక్యుమెంటరీ)

చిన్నా (తమిళ్‌/తెలుగు)

డిసెంబరు 1:

ఇండియానా జోన్స్‌: ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ (ఇంగ్లిష్‌)

డిసెంబరు 1: మాన్‌స్టర్‌ ఇన్‌సైడ్‌ (ఇంగ్లిష్‌)

సోనీలివ్..

నవంబరు 29 : మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (తెలుగు) (Martin luther king movie)

King.jpg

Updated Date - 2023-11-27T12:52:59+05:30 IST