రైలు ప్రమాదంలో నిర్మాత మరణం

ABN , First Publish Date - 2023-11-10T02:18:30+05:30 IST

‘ఆనందోబ్రహ్మ’, ‘తులసీదళం’, ‘తోటికోడళ్లు’ వంటి పదికి పైగా టీవీ సీరియల్స్‌, ‘నక్షత్రం’(2017) చిత్రాన్ని నిర్మించిన సాతులూరి వేణుగోపాల్‌ (60) మరణించారు...

రైలు ప్రమాదంలో నిర్మాత మరణం

‘ఆనందోబ్రహ్మ’, ‘తులసీదళం’, ‘తోటికోడళ్లు’ వంటి పదికి పైగా టీవీ సీరియల్స్‌, ‘నక్షత్రం’(2017) చిత్రాన్ని నిర్మించిన సాతులూరి వేణుగోపాల్‌ (60) మరణించారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు రైలులో వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఆయన కన్ను మూశారు. ‘ఆనందోబ్రహ్మ’ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించారు. ఆలాగే వేణుగోపాల్‌ నిర్మించిన ‘తోటికోడళ్లు’ సీరియల్‌లో జయసుధ నటించారు. వేణుగోపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2023-11-10T02:18:32+05:30 IST