సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దరువేయ్‌ రోయ్‌..

ABN, First Publish Date - 2023-01-27T04:43:59+05:30

సాయిరామ్‌ శంకర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వేయ్‌ దరువేయ్‌’. నవీర్‌ రెడ్డి దర్శకుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయిరామ్‌ శంకర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వేయ్‌ దరువేయ్‌’. నవీర్‌ రెడ్డి దర్శకుడు. దేవరాజ్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి టైటిల్‌ సాంగ్‌ని మంగళవారం హైదరాబాద్‌లో నాగచైతన్య విడుదల చేశారు. ‘‘పాట చాలా బాగుంది. సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకొంటుంద’’ని ఆకాంక్షించారు నాగచైతన్య. ‘‘మంచి డాన్స్‌ మూమెంట్లతో సాగే పాట ఇది. ట్యూన్‌ బాగా కుదిరింద’’న్నారు సాయిరామ్‌ శంకర్‌. ‘‘దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనుకంజ వేయకుండా తెరకెక్కిస్తున్నాం. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సంగీతాన్ని అందించారు. యాశ శివకుమార్‌, సునీల్‌, కాశీ విశ్వనాథ్‌, ఫృథ్వీ తదితరులు నటించారు.

Updated Date - 2023-01-27T04:44:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!