క్యూట్‌ లవ్‌స్టోరీ!

ABN , First Publish Date - 2023-10-19T00:08:21+05:30 IST

దినేశ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న ‘అలా నిన్ను చేరి’ చిత్రం ట్రైలర్‌ను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. మారేశ్‌ శివన్‌ను దర్శకుడిగా పరిచయం...

క్యూట్‌ లవ్‌స్టోరీ!

దినేశ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న ‘అలా నిన్ను చేరి’ చిత్రం ట్రైలర్‌ను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. మారేశ్‌ శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ‘ సినిమాలోని ఎమోషన్‌, కథ నచ్చి కొమ్మాలపాటి శ్రీధర్‌ నిర్మించారు. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు రెండు గంటల పాటు అదే ట్రాన్స్‌లో ఉంటారు. చిన్న సినిమాను సపోర్ట్‌ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్‌గారికి, నక్కిన త్రినాథరావుగారికి థాంక్స్‌’ అన్నారు. ‘ఇది ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమా. మంచి చిత్రాలను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్యూట్‌ లవ్‌స్టోరీకి క్యూట్‌ హీరోయిన్‌ పాయల్‌ కరెక్ట్‌. అలాగే హెబ్బా తన పాత్రకు న్యాయం చేసింది. అనుకున్న టైమ్‌కి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేశాం. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు నిర్మాత సాయి సుధాకర్‌.

Updated Date - 2023-10-19T00:08:21+05:30 IST