ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అవార్డుల నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను
ABN , First Publish Date - 2023-02-24T02:54:04+05:30 IST
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అవార్డుల నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ఈ సినిమా పొందింది...

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అవార్డుల నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ఈ సినిమా పొందింది. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌కు ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు. యాక్షన్ సినిమాలో బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఆయన నామినేట్ కావడం విశేషం.. ఈ అవార్డుల విజేతలను మార్చి 16వ తేదీన ప్రకటిస్తారు. కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇక ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే!