ఆ ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు
ABN , First Publish Date - 2023-08-17T04:03:43+05:30 IST
ఈ సినిమాకు ముందు కొందరు పేరున్న హీరోలను అనుకున్నాం. నానిలాంటి హీరోలకోసం ప్రయత్నించాం. కానీ కుదరలేదు. విశ్వక్ సేన్ కోసం స్ర్కిప్ట్ పంపించాం. సోహెల్ నాకు మంచి ఫ్రెండ్. ఈ కథ అతనికి...

ఈ సినిమాకు ముందు కొందరు పేరున్న హీరోలను అనుకున్నాం. నానిలాంటి హీరోలకోసం ప్రయత్నించాం. కానీ కుదరలేదు. విశ్వక్ సేన్ కోసం స్ర్కిప్ట్ పంపించాం. సోహెల్ నాకు మంచి ఫ్రెండ్. ఈ కథ అతనికి తెలుసు. నేను చేస్తానంటూ ముందుకు వచ్చాడు. కథకు న్యాయం చేస్తాడని భావించి అతనితో సినిమా చేశాం. హీరోయిన్ రూపా కొడవయూర్ తెలుగు యువతి కావడంతో ఎమోషన్స్ చక్కగా పలికింది. ఆమె డాక్టర్ కావడం ఆ పాత్రకు అడ్వాంటేజ్ అయింది’ అన్నారు శ్రీనివాస్ వింజనంపాటి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాకు చెప్పిన విశేషాలు ఇవి.
ప్రెగ్నెన్నీ టైమ్‌లో ఉన్న మహిళ కష్టాల్ని చూపిస్తే ఆర్ట్ ఫిల్మ్ అవుతుంది. అందుకే కమర్షియల్ అంశాలతో ప్రేమ కథ తయారు చేశాను. మేల్ ప్రెగ్నెంట్ అనగానే అందరూ వింతగా రియాక్ట్ అవుతారు. ప్రేక్షకులు కూడా మొదట అలాగే సర్‌ప్రైజ్ అవుతారు కానీ ఇందులోని ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారని నా నమ్మకం.
మైక్ మూవీస్ అధినేతలు మూవీ మేకింగ్‌లో అన్ని విధాల నాకు సపోర్ట్ చేశారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అవుట్‌పుట్ చూసి వాళ్లు సంతోషంగా ఉన్నారు.
నా తదుపరి చిత్రం కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా.