షరతులు వర్తిస్తాయి

ABN , First Publish Date - 2023-10-23T01:10:31+05:30 IST

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకుడు. నాగార్జున్‌ సామల, శ్రీష్‌ కుమార్‌, కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మాతలు...

షరతులు వర్తిస్తాయి

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకుడు. నాగార్జున్‌ సామల, శ్రీష్‌ కుమార్‌, కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మాతలు. మోషన్‌ పోస్టర్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదలైంది. ‘‘మనుషులు ఉన్నంత కాలం కుటుంబ బంధాలు ఉంటాయి. కుటుంబం ఉన్నంత కాలం మనుషులు ఉంటారు. కుటుంబాలు కొన్ని షరతుల మధ్య జీవిస్తూ ఆనందంగా ఉంటాయన్న విషయాన్ని ఈ కథలో చెప్పార’’న్నారు త్రివిక్రమ్‌. ఓ మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశామని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-10-23T01:10:31+05:30 IST