ఆదిపురుష్ కోసం స్వరకర్త.. బైకు యాత్ర!
ABN , First Publish Date - 2023-06-04T02:26:30+05:30 IST
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ఈనెల 16న విడుదల కానుంది. 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘ఆదిపురుష్’ స్వరకర్త అతుల్ ముంబై నుంచి తిరుపతికి ద్విచక్ర వాహనంలో పయనమయ్యారు...

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ఈనెల 16న విడుదల కానుంది. 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘ఆదిపురుష్’ స్వరకర్త అతుల్ ముంబై నుంచి తిరుపతికి ద్విచక్ర వాహనంలో పయనమయ్యారు. శనివారం ముంబైలో ఆయన బైక్ యాత్ర ప్రారంభిచారు. సోమవారంతిరుపతి చేరుకొంటారు. ఈ సినిమా కోసం ఆయన స్వర పరిచిన ‘జై శ్రీరామ్’ గీతాన్ని మంగళవారం తిరుమల శ్రీనివాసుడి పాదాలకు సమర్పించి ఆశీర్వాదం అందుకొంటారు. కృతిసనన్ సీత పాత్ర పోషించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణ బ్రహ్మగా కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు.