వేసవిలో వస్తున్న ది గోట్‌ లైఫ్‌

ABN , First Publish Date - 2023-12-01T00:40:31+05:30 IST

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడుజీవితం-మలయాళం). హాలీవుడ్‌ నటుడు జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌, కేఆర్‌ గోకుల్‌ కీలకపాత్రలు...

వేసవిలో వస్తున్న ది గోట్‌ లైఫ్‌

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడుజీవితం-మలయాళం). హాలీవుడ్‌ నటుడు జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌, కేఆర్‌ గోకుల్‌ కీలకపాత్రలు పోషించారు. విజువల్‌ రొమాన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘90వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే యువకుడి జీవిత కథను ‘ది గోట్‌ లైఫ్‌’లో చూపించబోతున్నాం. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇది’ అని అన్నారు.

Updated Date - 2023-12-01T00:40:34+05:30 IST