సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆగస్టులోనే వచ్చేది

ABN, First Publish Date - 2023-02-13T00:52:06+05:30

మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబో నుంచి వచ్చిన ‘అతడు’ అంత తేలిగ్గా మర్చిపోయే సినిమా కాదు. ‘ఖలేజా’ బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించలేకపోయినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబో నుంచి వచ్చిన ‘అతడు’ అంత తేలిగ్గా మర్చిపోయే సినిమా కాదు. ‘ఖలేజా’ బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించలేకపోయినా, మహేశ్‌ అభిమానులకు ఆ సినిమా బాగా నచ్చేసింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో చిత్రం వస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈనెలాఖరున మరో కీలకమైన షెడ్యూల్‌ మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ భారీ సెట్‌ తీర్చిదిద్దారు. అందులోనే దాదాపు నెల రోజుల పాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించినప్పటికీ, ఈ సినిమా వేసవిలో రావడం కుదరదు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంగీతం: తమన్‌.

Updated Date - 2023-02-13T00:52:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!