భూతాల కామెడీ

ABN , First Publish Date - 2023-08-13T00:40:15+05:30 IST

తమిళ నటుడు సంతానం హీరోగా నటించిన హారర్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ‘డీడీ రిటర్న్స్‌’. ఈ చిత్రం ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ పేరుతో ఈనెల 18న తెలుగులో విడుదలవుతోంది...

భూతాల కామెడీ

తమిళ నటుడు సంతానం హీరోగా నటించిన హారర్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ‘డీడీ రిటర్న్స్‌’. ఈ చిత్రం ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ పేరుతో ఈనెల 18న తెలుగులో విడుదలవుతోంది. నిర్మాతలు ఆర్‌. బి చౌదరి, ఎన్‌ వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంతానం మాట్లాడుతూ ‘‘డీడీ రిటర్‌ ్న్స’ తమిళంలో పెద్ద హిట్‌ అయింది. తెలుగులో నా సినిమాను విడుదల చేయాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది. పిల్లలు కూడా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’ అన్నారు. కథానాయిక సురభి మాట్లాడుతూ ‘ప్రేక్షకులతో కలసి డీడీ రిటర్న్స్‌ని థియేటర్లలో చూస్తాను. టీం అంతా కలసి చాలా హార్డ్‌వర్క్‌ చేశాం’ అని చెప్పారు. మహిళా ప్రేక్షకులు, పిల్లలు ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు ఎస్‌. ప్రేమ్‌ ఆనంద్‌ చెప్పారు. ఇంటిల్లిపాది చూడదగ్గ చిత్రం ‘భూతాల బంగ్లా’ అని ఎన్‌ వీ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2023-08-13T00:40:15+05:30 IST