సైంధవ పోరాటానికి క్లాప్‌

ABN , First Publish Date - 2023-01-27T04:55:10+05:30 IST

వెంకటేశ్‌ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కీలక పాత్రధారి...

సైంధవ పోరాటానికి క్లాప్‌

వెంకటేశ్‌ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కీలక పాత్రధారి. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. దిల్‌రాజు స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వెంకటేశ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. సినిమా ప్రారంభానికి ముందే.. ఓ టీజర్‌ విడుదల చేసి, ఆసక్తి పెంచాం. సినిమా కూడా అందరి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. పూర్తి యాక్షన్‌ మోడ్‌లో సాగుతుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కూర్పు: గ్యారీ బిహెచ్‌, సహ నిర్మాత: కిశోర్‌ తాళ్లూరు.

Updated Date - 2023-01-27T04:55:12+05:30 IST