‘కన్నప్ప’కు క్లాప్‌

ABN , First Publish Date - 2023-08-19T01:33:24+05:30 IST

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ శుకవ్రారం లాంఛనంగా ప్రారంభించారు.....

‘కన్నప్ప’కు క్లాప్‌

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ శుకవ్రారం లాంఛనంగా ప్రారంభించారు. కాళహస్తిలో జరిగిన పూజా కార్యక్రమాలతో ‘కన్నప్ప’ శ్రీకారం చుట్టుకొంది. మోహన్‌బాబు క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మోహన్‌బాబు నిర్మాత. నుపుర్‌ సనన్‌ కథానాయిక. ‘‘భారీ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. పలువురు పేరున్న నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకోబోతున్నారు. త్వరలో షూటింగ్‌ మొదలెడతాం. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమాని పూర్తి చేస్తామ’’ని విష్ణు తెలిపారు. పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ తదితరులు రచనా సహకారం అందించారు.

Updated Date - 2023-08-19T01:33:24+05:30 IST