అశ్విన్‌ చిత్రానికి క్లాప్‌

ABN , First Publish Date - 2023-11-21T00:21:36+05:30 IST

అశ్విన్‌ బాబు కథానాయకుడిగా గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దిగంగన సూర్యవంశీ కథానాయిక...

అశ్విన్‌ చిత్రానికి క్లాప్‌

అశ్విన్‌ బాబు కథానాయకుడిగా గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దిగంగన సూర్యవంశీ కథానాయిక. మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మాత. అప్సర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి విజయ్‌ కనకమేడల క్లాప్‌ కొట్టారు. సుబ్బు మంగాదేవి స్విచ్చాన్‌ చేశారు. వశిష్ట గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మంచి కథ కుదిరింది. ఇదో న్యూ ఏజ్‌ స్టోరీ. ఈతరానికి నచ్చేలా ఉంటుంది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నార’’ని నిర్మాత తెలిపారు. సంగీతం: వికాస్‌ బడిస, ఛాయాగ్రహణం: దాశరధి శివంద్ర.

Updated Date - 2023-11-21T00:21:39+05:30 IST