కొత్త కాన్సె్‌ప్టతో ‘సికడా’

ABN , First Publish Date - 2023-08-27T02:28:41+05:30 IST

‘కాదల్‌ ఎన్‌ కవియే’, ‘నెంజోడు చేరు’ వంటి తమిళ, మలయాళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన శ్రీజిత్‌ ఎడవనా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ‘సికడా’. ఒకే టైటిల్‌, ఒకే కథ, నాలుగు విభిన్న భాషలు...

కొత్త కాన్సె్‌ప్టతో ‘సికడా’

‘కాదల్‌ ఎన్‌ కవియే’, ‘నెంజోడు చేరు’ వంటి తమిళ, మలయాళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన శ్రీజిత్‌ ఎడవనా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ‘సికడా’. ఒకే టైటిల్‌, ఒకే కథ, నాలుగు విభిన్న భాషలు, 24 ట్యూన్స్‌.తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు చందూ మొండేటి, యువ కథానాయకుడు సోహెల్‌ విడుదల చేశారు. ఇందులో నటీనటుల గెటప్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రజిత్‌ , గాయత్రి మయూర, జైసీ జోస్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్‌ బెంగళూరు, అట్టపాడి, నాగమోన్‌, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ‘సికడా’ చిత్రాన్ని వందనా మీనన్‌, గోపకుమార్‌ పి నిర్మిస్తున్నారు. కొత్త కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రవితేజ అమరనారాయణ సాహిత్యం అందించారు.

Updated Date - 2023-08-27T02:28:41+05:30 IST