అడవిలో ‘చోరుడు’
ABN, First Publish Date - 2023-01-07T00:07:21+05:30
జి.వి.ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చోరుడు’.
జి.వి.ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చోరుడు’. ఇవానా, భారతీరాజా కీలక పాత్రధారులు. పివి.శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.డిల్లిబాబు నిర్మాత. ప్రముఖ కథానాయకుడు ధనుష్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదలైంది. అటవీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఏనుగు దంతాల చోరుడిగా జివి.ప్రకాశ్ కుమార్ కనిపించబోతున్నట్టు స్పష్టం అవుతోంది.ఈ యేడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘‘చాలా ఆసక్తికరమైన కథ ఇది. కథనం కూడా కొత్తగా ఉంటుంది. జి.వి ప్రకాశ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా అవుతుంద’’ని నిర్మాత తెలిపారు. ధీనా, వినోద్ మున్నా తదితరులు నటించారు. సంగీతం: యువన్ శంకర్ రాజా.