ఛోళికే పీఛే క్యాహై మళ్లీ వస్తోంది
ABN , First Publish Date - 2023-08-26T05:18:42+05:30 IST
మూడు దశాబ్దాల క్రితం కుర్రకారుకి కిక్ ఇచ్చిన పాట ‘ఛోళికే పీఛే క్యాహై’. సంజయ్‌దత్ హీరోగా నటించిన ‘ఖల్‌నాయక్’ చిత్రంలోని ఈ పాట, మాధురీ దీక్షిత్ అందాలు .. సినిమాని మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి...

మూడు దశాబ్దాల క్రితం కుర్రకారుకి కిక్ ఇచ్చిన పాట ‘ఛోళికే పీఛే క్యాహై’. సంజయ్‌దత్ హీరోగా నటించిన ‘ఖల్‌నాయక్’ చిత్రంలోని ఈ పాట, మాధురీ దీక్షిత్ అందాలు .. సినిమాని మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. సుభాష్ ఘయ్ రూపొందించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషించారు. ‘ఖల్‌నాయక్’ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి కావడంతో ఇప్పుడు 4కె వెర్షన్‌లో మళ్లీ విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 4న దాదాపు వంద థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సుభాష్ ప్రకటించారు. ‘ఖల్‌నాయక్ 2’ పేరుతో దీనికి సీక్వెల్ రానున్నదనీ, అందులో కూడా సంజయ్‌దత్ నటిస్తారనీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ సినిమాలోని సంజయ్‌దత్ స్టిల్‌ను షేర్ చేసి, సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు సుభాష్. ‘ఖల్‌నాయక్ 2’ సినిమా కోసం ఇంతవరకూ ఏ హీరోనీ సంప్రదించలేదు. మూడేళ్లుగా ఆ సినిమా స్ర్కిప్ట్ వర్క్ మీదే ఉన్నాం. అది పూర్తయిన తర్వాత ఆర్టిస్టుల వివరాలు వెల్లడిస్తాం. ‘ఖల్‌నాయక్ ’ విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 4న ముంబైలో ఆ సినిమాలోని ఆర్టిస్టులతో ఓ వేడుక నిర్వహిస్తున్నాం.’ అని వెల్లడించారు. ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంజయ్‌దత్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.