చిరు.. డబుల్‌ బొనాంజా!

ABN , First Publish Date - 2023-08-23T02:20:36+05:30 IST

మంగళవారం చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు డబుల్‌ బొనాంజా అందింది. చిరు నటించే రెండు కొత్త చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చేశాయ్‌. తన 156, 157 చిత్ర విశేషాల్ని అభిమానులతో పంచుకొన్నారు...

చిరు.. డబుల్‌ బొనాంజా!

మంగళవారం చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు డబుల్‌ బొనాంజా అందింది. చిరు నటించే రెండు కొత్త చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చేశాయ్‌. తన 156, 157 చిత్ర విశేషాల్ని అభిమానులతో పంచుకొన్నారు. 156వ చిత్రాన్ని గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. సుస్మిత కొణిదెల నిర్మాత. దర్శకుడి పేరు, ఇతర వివరాల్ని ప్రకటించలేదు. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారని టాక్‌. 157వ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. పంచభూతాలను శక్తి చక్రంలో ఆవిష్కరిస్తూ రూపొందించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తారని తెలుస్తోంది.

చిరుత అంటే..?!

రామ్‌ చరణ్‌ని అభిమానులు ‘చిరుత’ అని సంబోధిస్తుంటారు. అయితే ఈ పద ప్రయోగాన్ని తన తండ్రిపై ప్రయోగించారు చరణ్‌. చిరంజీవి పుట్టిన రోజున రామ్‌ చరణ్‌ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. చరణ్‌ కూతుర్ని చిరు ఎత్తుకొన్న చిత్రమిది. ఈ సందర్భంగా చిరుని ‘చిరుత’ అంటూ సంబోధించారు. చిరుత అంటే... ‘చిరంజీవి తాత’ అని అర్థమట. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-08-23T02:20:36+05:30 IST