Chiranjeevi: యువ దర్శకులు దీన్నో కేస్‌ స్టడీగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-15T04:09:15+05:30 IST

నిర్మాతలు పచ్చగా ఉంటేనే పరిశ్రమ, నటీనటులు బావుంటారు. బడ్జెట్‌ ఉంది కదా అని దర్శకులు దుబారా చేయకూడదు.

Chiranjeevi: యువ దర్శకులు దీన్నో కేస్‌ స్టడీగా తీసుకోవాలి

చిరంజీవి

‘నిర్మాతలు పచ్చగా ఉంటేనే పరిశ్రమ, నటీనటులు బావుంటారు. బడ్జెట్‌ ఉంది కదా అని దర్శకులు దుబారా చేయకూడదు. ముందస్తు ప్రణాళికతో వెళితే ఖర్చును నియంత్రించి నిర్మాతకు మేలు చేసినవాళ్లవుతారు’ అని చిరంజీవి అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. చిరంజీవి మాట్లాడుతూ ‘‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి ప్రేక్షకులు నుంచి వచ్చిన ఆదరణ చూస్తుంటే నాకు మాటలు కొరవడ్డాయి. దర్శకుడు బాబీ ఒక సవాల్‌గా తీసుకొని పనిచేశాడు కాబట్టే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది. యువ దర్శకులు ఈ చిత్రాన్ని కేస్‌ స్టడీగా తీసుకోవాలి. తమ్ముడు రవితేజ లేకపోతే ద్వితీయార్థంలో సినిమాకు ఇంత అందం వచ్చేది కాదు. ప్రేక్షకుల ఉత్సాహామే చిత్ర పరిశ్రమకు ఇంధనం’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ ‘ఈ సంక్రాంతి ‘వాల్తేరు వీరయ్య’దే. ఈ సినిమాకు లాంగ్‌రన్‌ ఉంది. అన్నయ్యతో ఒక ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్టైన్‌మెంట్‌ సినిమా చేయాలనుంది’ అన్నారు.

Updated Date - 2023-01-15T04:09:20+05:30 IST