Cherry with bunny : బన్నీతో చెర్రీ పోటీ..?

ABN , First Publish Date - 2023-01-24T04:58:11+05:30 IST

సంక్రాంతి అనగానే పెద్ద చిత్రాల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. అది ఈ యేడాది కూడా చూశాం. ఒకేసారి 5 చిత్రాలు బరిలో నిలిచాయి...

Cherry with bunny : బన్నీతో చెర్రీ పోటీ..?

సంక్రాంతి అనగానే పెద్ద చిత్రాల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. అది ఈ యేడాది కూడా చూశాం. ఒకేసారి 5 చిత్రాలు బరిలో నిలిచాయి. 2024లోనూ సంక్రాంతి సీజన్‌ ఇలానే రసవత్తరంగా సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి ఏయే సినిమాలు రాబోతున్నాయి? ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతోంది? అనే విషయాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. 2024 ముగ్గుల పండక్కి రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ చిత్రాలు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపుతున్నారు. దిల్‌రాజుకి సంక్రాంతి సీజన్‌ బాగా అచ్చొచ్చింది. ప్రతీ యేటా ఓ సినిమాని విడుదల చేయడం సెంటిమెంట్‌గా మార్చుకొన్నారు. ఈసారి ‘వారసుడు’ వచ్చింది. వచ్చే యేడాది చరణ్‌ సినిమాని లైన్‌లో పెట్టారు. శంకర్‌ సినిమా, అందులోనూ చరణ్‌ హీరో.. కాబట్టి అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కాబట్టి సంక్రాంతికి రావడమే సేఫ్‌.

మరోవైపు అల్లు అర్జున్‌ ఫోకస్‌ కూడా సంక్రాంతి మీదే ఉంది. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ‘పుష్ప’ కనీవినీ ఎరుగని విజయం సాధించడంతో ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంపై దాదాపుగా రూ.350 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్‌. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ‘పుష్ప 2’ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది సంక్రాంతికి మైత్రీ నుంచి రెండు చిత్రాలు వచ్చాయి. 2024లోనూ ఇదే సెంటిమెంట్‌ కొనసాగించాలని మైత్రీ భావిస్తోందేమో. వీటితో పాటుగా ప్రభాస్‌ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలొచ్చినా బన్నీ, చెర్రీల మధ్య పోటీ మాత్రం ఆసక్తిని పెంచుతోంది.

Updated Date - 2023-01-24T04:59:49+05:30 IST