చీటర్‌ సిద్ధం

ABN , First Publish Date - 2023-08-20T01:59:55+05:30 IST

రేఖ నిరోషా, చంద్రకాంత్‌ దత్తా, నరేందర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీటర్‌’. బర్ల నారాయణ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి నిర్మించారు. సెప్టెంబర్‌ 22న విడుదలవుతోంది...

చీటర్‌ సిద్ధం

రేఖ నిరోషా, చంద్రకాంత్‌ దత్తా, నరేందర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీటర్‌’. బర్ల నారాయణ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి నిర్మించారు. సెప్టెంబర్‌ 22న విడుదలవుతోంది. తొలి ప్రచార చిత్రాన్ని దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. పాటలకు చక్కటి స్పందన వచ్చింది’ అని చెప్పారు. సినిమా అనుకున్న దానికన్నా బాగా వచ్చింది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ నాళ్లగొప్పుల, సినిమాటోగ్రఫీ: గోవింద్‌ బాబు చర్ల

Updated Date - 2023-08-20T01:59:55+05:30 IST