సంక్రాంతికి వస్తున్న కెప్టెన్‌

ABN , First Publish Date - 2023-11-09T02:31:19+05:30 IST

తమిళహీరో ధనుష్‌ నటిస్తున్న పీరియడ్‌ ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40 బ్యాక్‌ డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

సంక్రాంతికి వస్తున్న కెప్టెన్‌

తమిళహీరో ధనుష్‌ నటిస్తున్న పీరియడ్‌ ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40 బ్యాక్‌ డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంకాంత్రికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ ప్రకటించారు. శివ రాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పవర్‌ఫుల్‌ రోల్స్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలవుతున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, ఫొటోగ్రఫీ: సిద్ధార్థ్‌ నుని.

Updated Date - 2023-11-09T02:31:21+05:30 IST