బుజ్జి మళ్లీ వచ్చింది
ABN , First Publish Date - 2023-10-28T04:51:25+05:30 IST
ధనరాజ్ కీలక పాత్ర పోషించిన ‘బుజ్జీ.. ఇలా రా’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బుజ్జీ ఇలా రా 2’ రూపుదిద్దుకొంటోంది...

ధనరాజ్ కీలక పాత్ర పోషించిన ‘బుజ్జీ.. ఇలా రా’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బుజ్జీ ఇలా రా 2’ రూపుదిద్దుకొంటోంది. ‘నో లిమిట్స్’ అనేది ఉపశీర్షిక. గరుడవేగ అంజి దర్శకుడు. కాసిమ్ నిర్మాత. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి సాయి రాజేశ్ క్లాప్ ఇచ్చారు. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటుగా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తార’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: చరణ్ - అర్జున్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి.