సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బుట్టబొమ్మ బాగుందన్నారు

ABN, First Publish Date - 2023-02-01T23:17:24+05:30

అనిఖా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌దాస్‌ ప్రధాన పాత్ర లు పోషించిన చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనిఖా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌దాస్‌ ప్రధాన పాత్ర లు పోషించిన చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ నెల 4న ఈ చిత్రం విడుద లవుతోంది. ఈ సందర్భంగా శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ సినిమా విశేషాలను వివరించారు.

  • మా నాన్న చంద్రశేఖర్‌ ప్రభావం వల్ల చిన్నతనంలోనే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. వర్మ కార్పొరేషన్‌లో రూపొందిన కొన్ని హిందీ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ‘జగడం’ చిత్రం నుంచి సుకుమార్‌ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నాను.

  • లాక్‌డౌన్‌ సమయంలో మలయాళ చిత్రం ‘కప్పేలా’ చూశాను. రీమేక్‌ చేస్తే బాగుంటుందనిపించింది. సితార సంస్థ రీమేక్‌ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసి, చినబాబు, నాగవంశీని సంప్రదించాను. కథను కొత్తగా చెప్పిన విధానం నచ్చి దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు.

  • ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ‘క్వీన్‌’ వెబ్‌సిరీస్‌లో అనిఖా సురేంద్రన్‌ నటన చూసినప్పుడు ఈ పాత్రకు సరిపోతుందనిపించింది. అర్జున్‌దాస్‌, సూర్య పేర్లను చినబాబు, వంశీ సూచించారు.

  • ఇది పూర్తిగా స్ర్కిప్ట్‌ మీద నడిచే కథ. ప్రథమార్థంలో కథనం పరంగా భారీ మార్పులు చేశాం. ‘కప్పేల’ మూలకథను తీసుకొని మన వాతావరణానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే, బావుంటుందనుకున్నాం. మా నమ్మకం నిజమైంది. మాతృక కన్నా రీమేక్‌ చాలా బాగా వచ్చింది. త్రివిక్రమ్‌ మాతృక కన్నా ‘బుట్టబొమ్మ బాగుంద’ని మెచ్చుకున్నారు.

Updated Date - 2023-02-01T23:17:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!