Butta Bomma: సితార బొమ్మ వాయిదా..

ABN , First Publish Date - 2023-01-21T17:45:20+05:30 IST

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’ (Butta Bomma). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) భాగస్వామ్యంతో

Butta Bomma: సితార బొమ్మ వాయిదా..
Butta Bomma Movie Still

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’ (Butta Bomma). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య (S Naga Vamsi and Sai Soujanya) నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ (Shourie Chandrasekhar Ramesh) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా ముందు ప్రకటించినట్లుగా జనవరి 26న (రిపబ్లిక్ డే) విడుదల కావడం లేదు. ఈ సినిమా విడుదలని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Butta Bomma Postponed)

సినిమా ఆలస్యంగా వచ్చినా.. ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘బుట్టబొమ్మ’ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే నటుడు అర్జున్ దాస్ (Arjun Das) ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. నాయిక అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) సైతం ఈ సినిమా కలర్ ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో విడుదల వాయిదా డిజప్పాయింట్ చేసే విషయమే అయినా.. సితార బొమ్మ కాబట్టి ఎప్పుడొచ్చినా.. అందుకు తగ్గట్లుగా వినోదం ఉంటుందని భావించవచ్చు.

ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్

గతేడాది ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘డీజే టిల్లు’ (DJ Tillu) చిత్రాన్ని నిర్మించింది. 2022 ఫిబ్రవరిలో విడుదలైన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వస్తున్న ‘బుట్టబొమ్మ’ కూడా ఆ విజయాన్ని పునరావృతం చేస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. (Butta Bomma Movie)

Updated Date - 2023-01-21T17:45:26+05:30 IST