బుసాన్‌ చిత్రోత్సవంలో...

ABN , First Publish Date - 2023-09-06T03:23:49+05:30 IST

రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటించిన చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ’. జులైలో విడులైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని పొందింది...

బుసాన్‌ చిత్రోత్సవంలో...

రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటించిన చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ’. జులైలో విడులైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని పొందింది. ‘బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. నిర్మాణసంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌ ఈ విషయాన్ని తెలిపింది. ఓపెన్‌ సినిమా కేటగిరీలో ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ చిత్రం ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేసింది. అక్టోబరు 4 నుంచి ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కరణ్‌జోహార్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - 2023-09-06T03:23:49+05:30 IST