Samudrakhani : నా సినిమాల్లో బ్రో బెస్ట్‌‘బ్రో’

ABN , First Publish Date - 2023-07-25T03:14:24+05:30 IST

విజువల్‌ ఫీస్ట్‌ లా ఉంటుంది. 53 రోజుల్లో పూర్తి చేశాం. కానీ 150 రోజులు షూట్‌ చేసిన సినిమాలా అవుట్‌పుట్‌ వచ్చింది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ‘బ్రో’ బెస్ట్‌’ అన్నారు సముద్రఖని. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌

Samudrakhani : నా సినిమాల్లో బ్రో బెస్ట్‌‘బ్రో’

సముద్రఖని

విజువల్‌ ఫీస్ట్‌ లా ఉంటుంది. 53 రోజుల్లో పూర్తి చేశాం. కానీ 150 రోజులు షూట్‌ చేసిన సినిమాలా అవుట్‌పుట్‌ వచ్చింది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ‘బ్రో’ బెస్ట్‌’ అన్నారు సముద్రఖని. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఆయన రూపొందించిన ‘బ్రో’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం పాత్రికేయులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 1994లో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచీ జయాపజయాలతో సంబంధం లేకుండా నా పని నేను చేసుకుంటున్నాను. నేను ఏదీ ప్లాన్‌ చేయలేదు. మన పని మనం సరిగ్గా చేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి.

  • త్రివిక్రమ్‌ అన్నయ్య సహకారంతో ఈ సినిమా చేయగలిగాను. ఈ కథ చెప్పినప్పుడు ఆయనకు క్లైమాక్స్‌, డైలాగ్స్‌ బాగా నచ్చాయి. తమిళంలో ‘వినోదయ సిత్తం’ తీసేటప్పుడు కొవిడ్‌ వల్ల ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నటించాను. ఈ కథ ఎక్కువ మందికి చేరువ కావాలని, పవన్‌కల్యాణ్‌గారు చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌గారు అనగానే చెప్పలేనంత ఆనందం కలిగింది. కాలమే త్రివిక్రమ్‌గారిని, కల్యాణ్‌గారినీ ఈ ప్రాజెక్ట్‌లోకి తెచ్చింది.

  • మా గురువు బాలచందర్‌గారితో కలసి 2004లో ఓ నాటకం చూశాను. ఎలా ఉందని ఆయన తర్వాత అడిగారు. ‘బాగుంది కానీ సామాన్యులకు కూడా చేరువ అయ్యేలా చేస్తే బాగుంటుంది’ అన్నాను. అప్పటి నుంచీ ఆ కథ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ నాటకం స్ఫూర్తిగా తీసుకుని 17 ఏళ్ల తర్వాత ‘వినోదయ సిత్తం’ సినిమా తీశాను. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్‌ చేస్తే , సమాజమే మనకు మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.

  • పవన్‌కల్యాణ్‌గారిని కలసి మొత్తం స్ర్కిప్ట్‌ వినిపించాక, షూటింగ్‌ ఎప్పటినుంచి అనుకుంటున్నారని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్‌ అన్నాను. ఆయన షాక్‌ అయ్యారు. అలా ఆయన్ని కలిసిన మూడో రోజు నుంచే షూటింగ్‌ ప్రారంభించాం. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీతో ఉన్నాననే విషయం ఆయనకు మొదటి రోజే అర్థమైంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో చేశారు. ఉపవాస దీక్షలో ఉండి కూడా టైమ్‌కి షూటింగ్‌కు వచ్చి ఎంతో సహకరించారు.

Updated Date - 2023-07-25T03:15:02+05:30 IST