అలరించే హాస్టల్‌ బాయ్స్‌

ABN , First Publish Date - 2023-08-21T02:15:11+05:30 IST

అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలసి కన్నడ బ్లాక్‌బస్టర్‌ ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు.

అలరించే హాస్టల్‌ బాయ్స్‌

అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలసి కన్నడ బ్లాక్‌బస్టర్‌ ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు. ఆగస్టు 26న విడుదలవుతోంది. ‘బేబీ’ చిత్ర బృందం చేతుల మీదుగా ‘బాయ్స్‌ హాస్టల్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. వార్డెన్‌ అనుమానాస్పద మరణంతో హాస్టల్‌లో ఉంటున్న కుర్రాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటినుంచి ఎలా బయటపడ్డారు అనే లైన్‌తో ఆసక్తికరంగా చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కన్నడలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులూ ఆదరించాలి’ అని కోరారు. సినిమా చాలా ఫన్‌, ఎనర్జిటిక్‌గా ఉందని సుప్రియ చెప్పారు.

Updated Date - 2023-08-21T02:15:11+05:30 IST