విమానం ఎక్కేస్తారా?
ABN, First Publish Date - 2023-05-03T02:00:00+05:30
సముద్రఖని, అనసూయ, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకుడు. జీ స్డూడియోస్‌తో కలసి కిరణ్ కొర్రపాటి నిర్మించారు...
సముద్రఖని, అనసూయ, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకుడు. జీ స్డూడియోస్‌తో కలసి కిరణ్ కొర్రపాటి నిర్మించారు. జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమతి పాత్రలో అనసూయ ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ‘విమానం’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూశాక తెలుస్తుంది. సుమతిగా అనసూయ నటన గుర్తుండిపోతుంది. ‘రంగస్థలం’ తరవాత అంతటి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం ‘సిన్నోడా.. ఓ సిన్నోడా’ అనే గీతాన్ని విడుదల చేస్తున్నాం. ఆ పాట అందరినీ ఆకట్టుకొంటుంద’’న్నారు. సంగీతం: చరణ్ అర్జున్.