నెత్తురు దూకెరా.. కత్తులు దూసెరా!

ABN , First Publish Date - 2023-09-25T01:14:11+05:30 IST

‘బాహుబలి’ ప్రభాకర్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్‌ దర్శకుడు. రావుల రమేశ్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి తొలి పాట ‘సుర సుర సుర సుర అసుర’ అనే గీతాన్ని...

నెత్తురు దూకెరా.. కత్తులు దూసెరా!

‘బాహుబలి’ ప్రభాకర్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్‌ దర్శకుడు. రావుల రమేశ్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి తొలి పాట ‘సుర సుర సుర సుర అసుర’ అనే గీతాన్ని నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. సురేశ్‌ గంగుల రాశారు. జాన్‌ భూషణ్‌ స్వర పరిచారు. ‘‘టైటిల్‌ బాగుంది. పాట కూడా కంటెంట్‌కి తగ్గట్టు రాశారు. సత్తా ఉన్న సినిమాల్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ జాబితాలో ఈ సినిమా ఉండాలని కోరుకొంటున్నా’’ అన్నారు రాజ్‌ కందుకూరి. ‘‘చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత.

Updated Date - 2023-09-25T01:14:11+05:30 IST