Blockbuster talk has arrived : బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది
ABN , First Publish Date - 2023-08-11T02:48:34+05:30 IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’ చిత్రం గురువారం విడుదలైంది. నెల్సన్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని...

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’ చిత్రం గురువారం విడుదలైంది. నెల్సన్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రేక్షకులు, మీడియా, ఇండస్ట్రీ నుంచి మంచి టాక్ వచ్చింది. రజనీకాంత్‌గారికి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ పడిందని అందరూ అంటున్నారు. ఆంధ్రాలో చాలా సెంటర్స్‌లో మ్యాట్నీ నుంచి కొత్త థియేటర్లు యాడ్ అయ్యాయి. సునీల్ నారంగ్‌తో కలసి మేం తొలిసారి విడుదల చేసిన ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది’ అన్నారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా హక్కులు ఇచ్చిన కళానిధి మారన్‌కు ధన్యవాదాలు. ‘జైలర్’ హిట్ అయింది. భవిష్యత్‌లో కూడా సన్ పిక్చర్స్‌తో కలసి పని చేయాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు.